పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి కే. టి రోడ్డు పై చోరీ జరిగింది. మంగళవారం రాత్రి సి. హెచ్ సంతోషి అనే మహిళ తన పనులు ముగించుకొని ఇంటికి నడుచుకుని వెళుతుండగా మెడలోని 2 తులాల బంగారు పుస్తెలతాడును గుర్తుతెలియని అగంతుకులు తెంపుకు పోయారు. ఈ షాక్ నుండి ఆమె తేరుకునేలోపే అక్కడ నుంచి వారు ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కాశిబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.