చిన్నబాడం జడ్పీ పాఠశాలకు ఎస్బీఐ ఆధ్వర్యంలో కంప్యూటర్లు వితరణ

77చూసినవారు
చిన్నబాడం జడ్పీ పాఠశాలకు ఎస్బీఐ ఆధ్వర్యంలో కంప్యూటర్లు వితరణ
పలాస మండలం చిన్నబడాం జిల్లా పరిషత్ హైస్కూల్‌కి పలాస ఎస్బీఐ శాఖ ఆధ్వర్యంలో సుమారు ఆరు లక్షల విలువచేసే రెండు కంప్యూటర్లు, రెండు బీరువాలు, 20 టేబుల్లు, 20 కుర్చీలు మొదలగు సామగ్రిని అందించారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో పలాస ఎస్బీఐ చీఫ్ మేనేజర్ వి. సూర్యనారాయణ, పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పట్టణ టీడీపీ అధ్యక్షుడు బడ్డ నాగరాజు, ఉపాధ్యాయ సిబ్బంది, వార్డు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్