శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంట్లు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ మేరకు సోమవారం ఉద్దానంలోని నీలావతి జీడి తోటల్లో మూడు ఎలుగుబంట్లు పట్ట పగలు సంచరిస్తుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అయితే కొందరు యువకులు ధైర్యం చేసి కేకలు వేయడంతో భల్లూకం సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయాయి. తక్షణమే అటవీ శాఖ అధికారులు స్పందించి, ఎలుగుబంటు లు రాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.