పలాసలో రెండు నాగుపాముల సయ్యాట

80చూసినవారు
పలాసలోని సూది కొండ సమీపంలో మంగళవారం రెండు నాగుపాముల సయ్యాట అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ మేరకు నాగుల చవితి కావడంతో అటుగా వెళ్తున్న స్థానికులకు భారీగా ఉన్న రెండు పాములు సయ్యాటాడుతూ కనిపించాయి. అయితే వాటిని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. సుమారు గంట సమయం పాటు ఆ రెండు సర్పాలు సయ్యాటలాడుతూ సమీప పొదల్లోకి వెళ్లడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్