కాశీబుగ్గ అంబేడ్కర్ నగర్ వీధిలో ఉన్న హనుమాన్ మండపం వద్ద ఆదివారం నిద్రిస్తున్న కోలా దేవా అనే యువకుడిపై నల్ల రాజేష్, అతని కుటుంబ సభ్యులు రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. గాయపడిన దేవాను స్థానికులు చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా బాధితుడు మాట్లాడుతూ. శనివారం సాయంత్రం వీధిలో క్రికెట్ ఆడుతుండగా నల్ల రాజేశ్తో వాగ్వాదం జరిగిందని, అందుకే దాడి చేశారని తెలిపారు.