గ్రామ అభివృద్ధికి విరాళం అందించిన ఎమ్మెల్యే

52చూసినవారు
హిరమండలం మండలంలో గల కూర్మ వైదిక గ్రామం నందు ఇస్కాన్ సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో సోమవారం శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు ఆయన నిర్వహించారు. అనంతరం కూర్మ గ్రామ అభివృద్ధికి 50 వేల రూపాయలు విరాళంగా అందజేశారు. ఆయన మాట్లాడుతూ హిందూ సనాతన సాంప్రదాయాలను ఆచరించే కూర్మ గ్రామం చూస్తే చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్