పాతపట్నం: సంక్షేమ పథకాలకు నోచుకోని చంద్రబాబు పాలన

68చూసినవారు
రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారం చేపట్టి ఐదు నెలల పాలన గడుస్తున్నప్పటికీ సంక్షేమ పథకాల అమలు చేయడం లేదని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆరోపించారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జగనన్న పాలనలో సంక్షేమ పథకాల అమల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో ఉండేదని గుర్తు చేశారు. సూపర్ సిక్స్ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదో సీఎం ప్రజలకు చెప్పాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్