సామూహిక జిల్లేడు ద్రావణం తయారు

76చూసినవారు
సామూహిక జిల్లేడు ద్రావణం తయారు
ఎల్ ఎన్ పేట మండలంలోని బసవరాజుపేట గ్రామంలో సామూహికంగా జిల్లేడు ద్రావణం తయారు చేశారు.10 లీటర్ల నాటు ఆవు మూత్రం, 20 కిలోల జిల్లేడు ఆకులు, 200 లీటర్ల నీటిలో 3 రోజులు మురగబెట్టిన తరువాత ద్రావణం తయారు అవుతుందని యూనిట్ ఇన్చార్జి బి.లలిత తెలిపారు. ఈ జిల్లేడు ద్రావణం వరిలో పోటాష్ లోపాన్ని నివారించవచ్చునని ఆమె చెప్పారు. అలాగే రసం పీల్చు పురుగు తెగుళ్లు నివారణకు వాడవచ్చునని ఆమె తెలిపారు. బి.రామరావు,ఎస్. ఆనందరావు, అప్పారావు, సంజీవరావు, ఎపిసిఎన్ఎప్ రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్