ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్ లో పనిచేస్తున్న ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ కు కూడా టీచర్స్ డే సందర్బంగా బెస్ట్ టీచర్స్ అవార్డులు ఇవ్వాలని ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ యూనియన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గంగు మన్మధరావు శనివారం కోరారు. ఈమేరకు శ్రీకాకుళంలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ లో అక్షరాస్యతలో వంద శాతం ఉత్తీర్ణత సాధించడానికి ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ పాత్ర కీలకమన్నారు