శ్రీకాకుళం రూరల్ మండలం పొన్నం పంచాయతీ నవనంబాడు గ్రామంలో మూతపడిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని శుక్రవారం కూటమినాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా జనసేన మండల అధ్యక్షుడు టి. కూర్మారావు మాట్లాడుతూ.. ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ దృష్టికి తీసుకువెళ్లి ఆరోగ్య కేంద్రాన్ని తెరిపించి ప్రజలకి మరల అందుబాటులో ప్రాథమిక చికిత్స ఉండేలా కృషి చేస్తామని తెలిపారు.