నగరంలోని ఎల్ఐసి కార్యాలయం ప్రక్కన ఉన్న కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. కళాశాల డైరెక్టర్ బి ఎస్ చక్రవర్తి జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రిన్సిపాల్ కె శివ శంకర్ యువత దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు. కళాశాలలో ఉన్న గాంధీజీ విగ్రహానికి పూల మాలలు వేసి అంజలి ఘటించారు. వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు.