శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఉదయం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ జెండా వందనం చేశారు. ముందుగా కలెక్టర్ పోలీస్ గౌరవ వందనం స్వీకరించి, మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహమ్మద్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.