ల‌డ్డూ నాణ్యతను ప‌రిశీలించిన ఎమ్మెల్యే శంక‌ర్‌

83చూసినవారు
ల‌డ్డూ నాణ్యతను ప‌రిశీలించిన ఎమ్మెల్యే శంక‌ర్‌
ఇటీవ‌ల రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రమైన ఆరోగ్య ప్రదాత అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ల‌డ్డూ ప్ర‌సాదాన్ని ఎమ్మెల్యే గొండు శంక‌ర్ ప‌రిశీలించారు. ఆయ‌న శ్రీకాకుళంలోని అర‌స‌వ‌ల్లి ఆల‌య ప‌రిస‌రాల్లో ఆదివారం ఆక‌స్మికంగా ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా భ‌క్తుల‌కు అంద‌జేస్తున్న సౌక‌ర్యాల‌ను, క్యూలైన్ల‌ను ప‌రిశీలించి మెరుగైన సేవ‌లు అందించాల‌ని ఆల‌య సిబ్బందికి సూచించారు.

సంబంధిత పోస్ట్