విద్యార్థులను చిన్నతనం నుంచే క్రీడలపై ఆసక్తి పెరిగేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని, క్రీడలకు ఆదరణ పెరగాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నదుకుదుటి ఈశ్వరరావు ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో ఏపీ రాష్టస్థాయి జూనియర్స్ బాలబాలికల బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీలను శ్రీకాకుళం, ఎచ్చెర్ల ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించారు.