శ్రీకాకుళం రూరల్ మండలం పొన్నం పంచాయతీ నవనంబాడు గ్రామంలో కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా సోమవారం పంచాయతీ కూటమి నాయకులు దుంగ ఆనందరావు ఆధ్వర్యంలో "ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమం నిర్వహించి ఇంటింటికి కరపత్రాలు పంచుతూ స్థానిక గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.