రైలు పట్టాలపై విరిగిన చెట్టు.. స్తంభించిన ట్రాఫిక్

54చూసినవారు
టెక్కలి మండల కేంద్రంలో ఆదివారం రాత్రి పూరీ-గునుపూర్ రైలు నిలిచిపోవడంతో ప్రయాణీకులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఆదివారం రాత్రి 7. 30 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ ఈదురుగాలులు వేయడంతో రైలు ట్రాక్ కు అడ్డంగా ఒక చెట్టు పడింది. దీంతో టెక్కలిలో సుమారు గంట పాటు రైలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. వెంటనే రైల్వే సిబ్బంది చెట్టును తొలగించే ప్రయత్నం చేశారు. వర్షంలో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.

సంబంధిత పోస్ట్