సంతబొమ్మాలి మండలం దండుగోపాల పురం జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో (ఇనిషియేట్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీస్ ) ఐఎస్ఆర్ఎ సంస్థ వ్యవస్థాపకుడు గౌరునాయుడు సోమవారం పాఠశాల విద్యార్థులు 300 మందికి మూర్తిమత్వ వికాసం అనే అంశంపై ఉపన్యాసం ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చేయూత, వృద్ధుల సంస్థకు కొంత విరాళాలు సేకరించి సహాయపడాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.