టెక్కలి మండల కేంద్రంలోని టెక్కలి- మెలియపుట్టి రోడ్డులో ఉన్న ఒక జీడిపప్పు పరిశ్రమలో బుధవారం వేకువజామున ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అటుగా వెళ్తున్న స్థానికులు మంటలను గుర్తించి పరిశ్రమ యజమాన్యానికి సమాచారం అందించారు. ఘటనలో పరిశ్రమలోని జీడిపప్పు బస్తాలు కాలిపోగా పరిశ్రమ లోని యంత్రాలకు కూడా మంటలు వ్యాపించాయి. సమాచారం తెలుసుకున్న టెక్కలి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.