టెక్కలి మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. టీ. గోవిందమ్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ తత్సమాన ఉత్తీర్ణత కలిగిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు కళాశాలలో సంప్రదించాలని ఆమె కోరారు.