నందిగాం మండలంలోని సుభద్రాపురం గ్రామ సమీప జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై వెళ్తున్న కారు ట్రాక్టర్ను అధిగమించే క్రమంలో అదుపు తప్పింది. బలంగా ట్రాక్టర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 1033 నేషనల్ హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని చికిత్సకు టెక్కలి ఆసుపత్రికి తరలించారు.