ఆముదాలవలస: రహదారి పనులకు జేసీబీ నడుపుతూ పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కూన
ఆముదాలవలస మండలం పురుషోత్తపురం పంచాయతీలో రహదారి పనులకు ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రారంభోత్సవం చేశారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా స్వయంగా ఆయనే జేసీబీ నడుపుతూ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రహదారిని నిర్మిస్తున్నామని తెలిపారు.