తండ్రి మెగాస్టార్ అయితే.. ఆయన కొడుకు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. 'గేమ్ ఛేంజర్' ఈవెంట్‌లో రామ్‌చరణ్‌పై పవన్ ప్రశంశలు కురిపించారు."రామ్ చరణ్ ఆస్కార్ లెవల్ యాక్టర్. మామూలు రోజుల్లో సూటుబూటు వేసుకుని వెళ్లేవాడు.. అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే చెప్పులు వేసుకోకుండా నడుస్తాడు. చరణ్ గుణం, వ్యక్తిత్వం అలాంటిది. మంచి క్రమశిక్షణలో పెరిగాడు. చరణ్ మా బంగారం. నాకు తమ్ముడు లాంటి వాడు." అని పవన్ పేర్కొన్నారు.