అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌లలో సోడియం, చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్స్ వంటివి మోతాదుకు మించి ఉంటాయి. వీటిని తరచూ తినడం వల్ల ఊబకాయం, మధుమేహం వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల ముప్పు పొంచి ఉంటుందని పరిశోధకులు తెలిపారు. స్లైస్డ్ వైట్ బ్రెడ్, చక్కెరతో కూడిన శీతల పానీయాలు, అతిగా శుద్ధి చేసిన ఆహార పదార్థాలు.. వంటివి అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ జాబితాలోకి వస్తాయి. వీటిని తింటే హృదయ సంబంధ వ్యాధుల ముప్పు కూడా పెరుగుతుందని NIH నిపుణుల బృందం వెల్లడించింది.