ఆమదాలవలస: రూ. 4వేల పింఛన్ తో లబ్ధిదారులు ఆనందంగా ఉన్నారు

66చూసినవారు
ఐదేళ్ల వైసీపీ పాలనలో రూ.3వేల పింఛన్ కేవలం మూడు నెలల పాటు మాత్రమే అందించారని ఆముదలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన పొందూరు మండలం కింతలి గ్రామంలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందించారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లోనే 4000 రూపాయలను అందించినట్లు తెలిపారు. రూ. 4వేలు పెన్షన్ తో లబ్ధిదారులంతా ఆనందంగా పండగ చేసుకుంటున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్