పొందూరు మండలంలోని గోకర్ణపల్లి, రంగనాధపేట గ్రామాల్లో నూతనంగా అంగన్వాడీ భవనాలు నిర్మించేందుకు రూ. 20 లక్షల అంచనా విలువతో నిధులు మంజూరు అయినట్లు ఆమదాలవలస ఎమ్మెల్యే కార్యాలయం వర్గం శుక్రవారం ప్రకటనలో తెలిపారు. అంగన్వాడి భవనాలు నిర్మించాలన్న గ్రామస్థుల వినతి మేరకు ఎమ్మెల్యే కృషితో ఈ నిధులు మంజూరైనట్లు తెలిపారు. త్వరలోనే శుంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభింస్తామని పేర్కొన్నారు.