జోరు వానలో వైద్య బృందం

74చూసినవారు
జోరు వానలో వైద్య బృందం
స్పెషల్ ఆఫీసర్ రాజేంద్రప్రసాద్ సమాచారంతో ఆదివారం ఆమదాలవలస మండలం తురక పేట పంచాయతీలో పలువురు విష జ్వరాలతో బాధపడుతున్నారని తెలుసుకున్న వైద్య బృందం మెడికల్ క్యాంపు నిర్వహించారు. డాక్టర్ శ్రీనివాసరావు ఎండిఓ స్రవంతి ఆధ్వర్యంలో వర్షం పడుతున్నప్పటికీ జ్వరంతో బాధపడుతున్న వారి ఇంటింటికి వెళ్లి రక్త పరీక్షలు చేసి మందులు ఇచ్చి తగు జాగ్రత్తలు పాటించమని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మరియు వైద్య బృందం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్