రణస్థలం మండలంలోని బండిపాలెంకు చెందిన అమరా అయ్యప్ప (34) ఈ నెల 21న వ్యక్తి గత కారణాలతో పురుగుల మందు తాగాడు. జిల్లా కేంద్రంలో సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో గురువారం మృతి చెందాడు. భార్య దివ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు జె. ఆర్. పురం ఎస్ఐ ఎస్. చిరంజీవి తెలిపారు. అయ్యప్పకు ఇద్దరు పిల్లలు కామేశ్వరి, మనోజ్ కుమార్ ఉన్నారు.