ఎచ్చెర్ల: సైక్లోన్ షెల్టర్లను పరిశీలించిన డ్వామా పీడీ

84చూసినవారు
ఎచ్చెర్ల: సైక్లోన్ షెల్టర్లను పరిశీలించిన డ్వామా పీడీ
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తుఫాన్ ప్రభావం ఉంటుందన్న నేపథ్యంలో తుఫాన్ షెల్టర్లను పరిశీలించడం జరిగిందని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ బి సుధాకర్ రావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఎచ్చెర్ల మండలం బొంతల కోడూరు పంచాయితీ దిబ్బల పాలెం గ్రామంలో ఉన్న తుఫాను రక్షిత భవన నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లయితే స్థానికులు ఈ భవనంలో ఉండడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్