ఉమ్మడి జిల్లాల సర్పంచుల సంఘం అధ్యక్షులు, రణస్థలం సర్పంచ్ పిన్నింటి వెంకట భానోజీ నాయుడు ఆదివారం పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, కాలువల నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ఉపాధి హామీ నిధులను కూటమి ప్రభుత్వం సమకూర్చిందని తెలిపారు. ఈ క్రమంలో ప్రతి గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.