అంబేడ్కర్ స్మృతివనంలో శిలాఫలకాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ కంచిలి మండల వైసీపీ నేతలు శనివారం సాయంత్రం నిరసన వ్యక్తం చేశారు. కంచిలి మండల కేంద్రంలో ఉన్న డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులు చేతపట్టి నినాదాలు చేశారు. శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎంపీపీ దేవదాస్ రెడ్డి, వైసీపీ అధ్యక్షుడు మృత్యుంజయరావు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.