విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని బాగా చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఎమ్మెల్యే బెందాళం అశోక్ అన్నారు. బుధవారం కంచిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందజేసిన పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు ఆయన అందజేశారు. కూటమి ప్రభుత్వం చదువులు, ఉపాధి అవకాశాలకోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. ఆయనతోపాటు టిడిపి నాయకులు పాల్గొన్నారు.