జలుమూరులో విద్యుత్ సరఫరాకు అంతరాయం
జలుమూరు సబ్ స్టేషన్ పరిధిలోగల, 11కేవీ శ్రీ ముఖలింగం ఫీడర్ చెట్టుకొమ్మలు తొలగించే నిమిత్తం శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నామని ఏఈ వెంకటేశ్వరరావు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ జలుమూరు మండలం కిల్లివానిపేట, పెద్దనామానపేట, చిన్ననామాన పేట, గంగాధర్ పేట తదితర గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నామని అన్నారు. తమ వినియోగదారులు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు.