Feb 19, 2025, 02:02 IST/కరీంనగర్
కరీంనగర్
కరీంనగర్: తెలంగాణ చౌక్ లో నిరసన
Feb 19, 2025, 02:02 IST
కేంద్ర బడ్జెట్లో కరీంనగర్ జిల్లాకు అన్యాయం జరిగిందంటూ వామపక్ష పార్టీ నాయకులు మంగళవారం ఆందోళనకు దిగారు. కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో నిరసన తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర బడ్జెట్ పేద ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. కార్పొరేట్ శక్తులకు బడ్జెట్ అనుకూలంగా ఉందన్నారు. భీమా రంగాన్ని 100 శాతం ప్రైవేటీకరణ చేయాలని చూస్తోందన్నారు. నాయకులు, కార్య కర్తలు, పాల్గొన్నారు.