కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం తెలిపారు. గొప్ప ఆర్థికవేత్త, రాజకీయ నాయకుడు, మానవతావాది మన్మోహన్ సింగ్ ఇక లేరు అని భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ఆయన తీసుకున్న అసామాన్య నిర్ణయాల్లో మానవతా దృక్పథం కూడా ఉండేదని పేర్కొన్నారు. 'మన్మోహన్‌సింగ్.. అసలైన నవభారత నిర్మాత. భరతమాత ఓ గొప్ప కుమారుడిని కోల్పోయింది. నవభారత నిర్మాత మన్మోహన్‌సింగ్' అని కొనియాడారు.