ఆటో బోల్తా.. తప్పిన పెను ప్రమాదం
మెళియాపుట్టి- టెక్కలి ప్రధాన రహదారిలో మామిడిగుడ్డి కూడలి వద్ద ఆటో బోల్తా పడింది. సోమవారం మధ్యాహ్నం శీతల పానీయాలతో టెక్కలి వెళ్తున్న ఆటో రహదారిపై ఉన్న గుంతను తప్పించబోయే క్రమంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.