శ్రీకాకుళం: కత్తితో గొంతు కోసుకున్న వ్యక్తి
మద్యం మత్తులో ఓ వ్యక్తి కత్తితో తన గొంతు కోసుకున్నాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలోని నందిగాం మండలం కొత్తగ్రహారంలో బుధవారం జరిగింది. క్షతగాత్రుడిని స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.