సమగ్ర శిక్ష ఉద్యోగులు గురువారం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం సమర్పించారు. గత 24 రోజులుగా సమ్మె చేయడం జరుగుతుందని, తమ న్యాయమైన డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కారం అయ్యేలా చూడాలని ఈ సందర్భంగా కోరారు. సానుకూలంగా స్పందించిన ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు.