గృహ నిర్మాణాలు పూర్తి చేసేందుకు కృషి చేయండి

78చూసినవారు
మందస మండలం బేతాళపురం గ్రామంలో శనివారం 'మన ఇల్లు- మన గౌరవం' కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన ఇళ్లను 2025 మార్చి 31వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. లేనిపక్షంలో పెండింగ్ లో ఉన్న బిల్లులు లబ్ధిదారులకు అందవని గుర్తు చేశారు. ఈ కార్యక్రమాన్ని నిరుపేద లబ్ధిదారులు సద్వినిగం చేసుకోవాలని ఆమె కోరారు.

సంబంధిత పోస్ట్