కొత్తూరు: అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరపాలి

81చూసినవారు
కొత్తూరు: అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరపాలి
కొత్తూరు మండలం తహసిల్దార్ రవిచంద్రను మంగళవారం కలిసినట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ తెలిపారు. మండల పరిధిలో భూముల రీసర్వేపై జరిగిన అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుతూ వినతిపత్రం అందించారు. రైతులకు, భూములు యజమానులకు న్యాయం చేయాలని కోరారు. రెవెన్యూ యంత్రాంగం సత్వరమే చర్యలు చేపట్టి రీసర్వేలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్