కొత్తూరు: ఉచిత ఇసుక ప్రారంభించిన ఎమ్మెల్యే

67చూసినవారు
కొత్తూరు: ఉచిత ఇసుక ప్రారంభించిన ఎమ్మెల్యే
ఉచిత ఇసుక పంపిణీ విధానం రాష్ట్ర చరిత్రలో ఓ సువర్ణాధ్యాయమని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గురువారం అన్నారు. కొత్తూరు మండలం, నివగాం, హిరమండలం మండలం ఆకుల తంపర ర్యాంపులలో ఉచిత ఇసుక విధానాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టి ఇసుక పంపిణీని ప్రారంభించారు. పారదర్శక విధానంతో నాణ్యమైన ఇసుక అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.

సంబంధిత పోస్ట్