గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో చేసిన తప్పులు, పాపాలే విద్యుత్తు చార్జీల పెంపునకు కారణమని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు విమర్శించారు. ఇటీవల వైసీపీ చేసిన నిరసనపై ఆయన స్పందించారు. కరెంటు ఛార్జీల పెంపు పాపం జగన్ రెడ్డిదేనని మండిపడ్డారు. 2019 నుంచి 2024 వరకు ఈ ఐదేళ్లలో విద్యుతు కొనుగోల్లో జగన్ చేసిన అవినీతి ప్రజలకు తెలుసన్నారు.