ఉపాధి హామీ పనులు వేగవంతం చేయండి

82చూసినవారు
అన్ని గ్రామాల్లో పనులు వేగవంతం చేయాలని మెలియాపుట్టి ఏపివో రవి అన్నారు. గురువారం మండలం కేంద్రంలోని ఉపాధి కార్యాలయం ఆవరణలో సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. అన్ని గ్రామాలలో ఉపాధి హామీ పనులు ప్రారంభించాలని 150 మందికి తగ్గకుండా ప్రతి గ్రామంలో పనులు చేయాలని అన్నారు. పనుల వద్ద నీరు, నీడ అందుబాటులో ఉంచాలన్నారు. ఈసి ఆదినారాయణ రెడ్డి, పలువురు సిబ్బంది ఉన్నారు.

సంబంధిత పోస్ట్