కోల్‌కతా వైద్య విద్యార్థిని హత్యాచారం, దేశంలో పెరుగుతున్న అత్యాచార ఘటనపై సోనాగాచికి చెందిన వేశ్యలు వినూత్నంగా నిరసన చేస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల కోసం దుర్గా విగ్రహాల తయారీకి తమ ఇళ్లలోని మట్టిని ఇచ్చేందుకు నిరాకరించారు. వ్యభిచార గృహాల మట్టిని దుర్గామాత విగ్రహానికి ఉపయోగించడం అక్కడి సంప్రదాయం. తమ పనిని వృత్తిగా గుర్తించాలని కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నామని, అందుకే మట్టి ఇవ్వట్లేదని వారు చెబుతున్నారు.