వరిలో సాగు ఖర్చులు తగ్గించే యాంత్రీకరణ పద్ధతులే మేలు
సాగు భారమవుతున్న ప్రస్తుత తరుణంలో వ్యవసాయంలో యాంత్రీకరణ మేలని కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ కె. భాగ్యలక్ష్మి, లైదాం సర్పంచ్ జి. అనంతరామకృష్ణ అన్నారు. శనివారం పొందూరు మండలం లైదాం గ్రామంలో డా.రెడ్డీస్ ఫౌండేషన్, కృషి విజ్ఞాన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో రైతులకు నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ యాంత్రీకరణ వలన సమయంతో సాగు ఖర్చులు ఆదా చేసుకోవడమే కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని అన్నారు.