AP: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని దాఖలైన పిటిషన్ పై విచారణ నేపథ్యంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.ట్రాఫిక్ చలాన్లు చెల్లించని వారి ఇళ్లకు విద్యుత్ సప్లై, వాటర్ సప్లై ఆపేయాలని అధికారులను ఆదేశించింది. హెల్మెట్ ధరించని బైకర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపింది. కేంద్ర మోటార్ వాహన సవరణ చట్టం ప్రకారం రూల్స్ అమలు చేయకపోవడంతో రోడ్డు ప్రమాదాలు పెరిగాయని పేర్కొంటూ ఓ అడ్వకేట్ యోగేశ్ ఇటీవల పిల్ వేశారు.