వివాహ వేడుకలో విద్యుత్ షాక్.. ఒకరు మృతి
రణస్థలం మండలం అల్లివలసలో ఓ వివాహ వేడుకల్లో మరో నిమిషాల్లో తాళి కట్టాల్సి ఉండగా.. ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మైలపల్లి లక్ష్ముడు ఇంట్లో ఆదివారం రాత్రి జరుగుతున్న వివాహ వేడుకల్లో విద్యుత్ షాక్ తగిలి ఒకరు మృతి చెందగా. 12మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో జీరుపాలెంకు చెందిన అంబటి సీతమ్మ(45) మరణించగా.. గాయపడిన వారు రణస్థలంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.