తెలంగాణ సచివాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలు, కుటుంబ సభ్యులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఉద్రికత్తంగా మారడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఇక్కడ కొన్ని రోజులు, అక్కడ కొన్ని రోజులు డ్యూటీలు వేస్తున్నారని, తమ బాధలను అర్థం చేసుకోవాలని కానిస్టేబుళ్ల భార్యలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.