కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలకు HYD సిటీ సివిల్ కోర్టు చివాట్లు పెట్టింది. కేటీఆర్ వేసిన పరువునష్టం దావాను కోర్టు విచారించింది. బాధ్యత గల పదవిలో ఉండి ఆ వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ సురేఖను మందలించింది. ఒక ప్రభుత్వ ప్రతినిధి నుంచి ఇలాంటి మాటలు రావడం తీవ్ర అభ్యంతరకరం, అనూహ్యమని పేర్కొంది. మరోసారి కేటీఆర్‌పై అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించింది. ఆమె వ్యాఖ్యలకు సంబంధించి అన్ని పోస్టులను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆదేశించింది.