సంతబొమ్మాలి: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తల్లి వైద్య సహాయం పొందుతూ మృతి

64చూసినవారు
సంతబొమ్మాలి: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తల్లి వైద్య సహాయం పొందుతూ మృతి
సంతబొమ్మాలి మండలం కుమందానివానిపేట గ్రామంలో ఇద్దరు చిన్నారులకు తల్లి విషమిచ్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తల్లి దుర్గ సైతం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం వేకువజామున 3 గంటలకు మృతిచెందినట్లు ఆసుపత్రి సిబ్బంది వెల్లడించారు. చిన్నారుల మృతి అనంతరం ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్