కల్లాడలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

70చూసినవారు
కల్లాడలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం
నందిగాం మండలం కల్లాడ గ్రామంలో మంగళవారం పశు వైద్య అధికారుల ఆధ్వర్యంలో పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 21పశువులకు గర్భకోశ చికిత్సలు, అమ్మవారు సోకకుండా 42గొర్రెలు, మేకలకు నివారణ మందులు వేశారు. 23పశువులకు, 42మేకలు గొర్రెలకు ఏలిక పాము నివారణ మందులు వేశారు. పాల ఉత్పత్తికి పశుగ్రాసం సాగు, టీఎంఆర్ దాణా ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలోఓ రాజులమ్మ,  ఈశ్వర్, జోగారావు, అనిల్, అనిత పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్